18-02-2025 02:39:29 PM
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): నగరం నుండి విదేశాలకు అక్రమంగా విదేశీ కరెన్సీ(Foreign Currency) తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు ఓ వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో మంగళవారం చోటుచేసుకుంది. డీఆర్ఐ అధికారుల(DRI officials) కథనం ప్రకారం... తెల్లవారుజామున హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లేందుకు నగరానికి చెందిన అమీర్ అహ్మద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నాడు.
డీఆర్ఐ అధికారులు ముందస్తు సమాచారంతో హైదరాబాద్ నుంచి విదేశాలకు విదేశీ కరెన్సీ అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు నిర్వహించారు. అమీర్ అహ్మద్ పై అనుమానంతో లగేజీ బ్యాగును స్కానింగ్ చేయడంతో అందులో విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని రూ. 22.75 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అమీర్ అహ్మద్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు వెల్లడించారు.