26-04-2025 12:59:11 AM
సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన బలగాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చూ సినట్టు కథువాకు చెందిన ఓ మహిళ చెప్పడంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. శుక్రవారం కథువా ప్రాంతాన్ని అంగుళం అంగుళం జల్లెడ పట్టాయి.
కేవలం కథువాలో మాత్రమే కాకుండా జమ్మూలోని పుల్వామా, బారాముల్లా సెక్టార్లలో కూడా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ సోదాల విషయాన్ని అధికారులు ధ్రు వీకరించారు. బారాముల్లాలోని పట్టా న్ ఏరియాలో జమ్మూకశ్మీర్ నేషనల్ ఫ్రంట్ (జేకేఎన్‌ఎఫ్)కు చెందిన వ్యక్తి ఇంట్లో నేరారోపణలకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.