calender_icon.png 24 January, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్ ఫీల్ రోడ్డుకు బలవంతపు భూసేకరణ ఆపాలి

24-01-2025 12:00:00 AM

ఎక్వాయిపల్లిలో రైతులను కలిసిన సిపిఎం నాయకులు 

కడ్తాల్, జనవరి 23 ( విజయ క్రాంతి ) : గ్రీన్ ఫీల్ రోడ్డు ఏర్పాటు కోసం సాగుభూములను లాక్కొని ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేస్తే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన తప్పదని సిపిఎం నాయకులు గుమ్మడి కురుమయ్య, జిల్లెల్ల పెంటయ్య, ఆశీర్వాదం అన్నారు. గురువారం కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో గ్రీన్ ఫీల్ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులతో వారు సమావేశమయ్యారు.

నేడు కందుకూరులో నిర్వహించే సదస్సుకు పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావాలని కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్ రహదారి నిర్మాణంతో రైతుల భూములు తీసుకోవడం తగదని ఏళ్ల కాలంగా సాగు చేసుకుంటున్న భూముల నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. బాధిత రైతులకు ఎల్లప్పుడూ సిపిఎం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.