calender_icon.png 11 March, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఫోర్స్ నెక్ట్స్ ఫర్ వాట్స్ నెక్ట్స్ క్యాంపెయిన్’

11-03-2025 01:01:33 AM

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ఆధునిక యువతే లక్ష్యంగా పురుషుల ఇన్నర్‌వేర్ బ్రాండ్ ఫోర్స్ నెక్స్ ఫర్ వాట్స్ నెక్స్ క్యాంపెయిన్ ప్రారంభించింది. డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో పురుషుల ఇన్నర్‌వేర్ బ్రాండ్ ఫోర్స్ నెక్స్.. పురుషుల లోదుస్తులు, క్రీడా దుస్తులు, వ్యాయామ దుస్తులకు ప్రసిద్ధి చెందిందని డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్ గుప్తా తెలిపారు.

ఈ క్యాంపెయిన్ ద్వారా ఇన్నర్‌వేర్, అథ్లిటిక్ వేర్, యాక్టివ్వేర్ దుస్తులను కొత్త కోణంలో చూపించనున్నామన్నారు. ఇవి వ్యక్తిగత శైలిని, ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ వ్యక్తీకరణను సూచించే విధంగా ఉంటాయన్నారు. ప్రసిద్ధ చలన చిత్ర దర్శకుడు ఉజేర్ ఖాన్ రూపొందించిన ఈ యాడ్ ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించనుందన్నారు.

ఈ ప్రచారాన్ని లోవ్ లింటాస్ రూపొందించారన్నారు. ఆధునిక యువత జీవితాల్లో వీటి పాత్రను కొత్త కోణంలో పునర్నిర్వచించిందన్నారు. స్లీక్ డిజైన్లు, బోల్ వెయిస్ట్బాండ్స్ ద్వారా ఈ ప్రచారం ఆధునిక వ్యక్తిగత శైలిలో కీలకమైన భాగంగా మారాయన్నారు. మరింత సమాచారానికి 9959154371/ 9959154371 నంబర్లలో సంప్రదించవచ్చాన్నారు.