calender_icon.png 24 December, 2024 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాసంగికి నీళ్లు లేవనడం కేవలం అసమర్థత

24-12-2024 01:17:37 AM

మంత్రి జూపల్లి ప్రగల్బాలు మానుకోవాలి 

అభివృద్ధి పనులకు నిధులు తేవాలి: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): యాసంగికి సాగునీరివ్వలే మని ప్రభుత్వం ప్రకటించడం కేవలం అసమర్థతేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఉత్తర ప్రగల్భాలు మానుకుని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు తీసుకువస్తే బాగుంటుందని హితవు పలికారు. మంత్రి జూపల్లి  ఎమ్మెల్యేగా, మంత్రిగా 20 ఏళ్ల పాటు పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించి జిల్లాకు ఏం మం చి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాం డ్ చేశారు.

కేవలం ప్రతిపక్ష పార్టీలపై విమర్శలకు పరిమితం కాకుండా, పాలమూరు  ఎత్తిపోతల పనుల ను పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. 90శాతం పాలమూరు ఎత్తిపోతల పనులు పూర్తి చేయించిన ఘనత నాటి సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి  కేవలం 10శాతం పూర్తి చేయలేని స్థితి లో ఉన్నారని ఎద్దేవా చేశారు. సాగునీటి వసతి లేక, రుణమాఫీ కాక రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఇబ్బం దిపడుతున్నారన్నారు.