calender_icon.png 31 October, 2024 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వెట్టయాన్’ కోసం..

12-08-2024 12:00:00 AM

సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, మలయాళ స్టార్ ఫహద్ పాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ భాగమయ్యారు.

ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీలో నటి రితికా సింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దీంతో ఆమె తన పాత్రకు సంబంధించి డబ్బింగ్‌ను ఆదివారం ప్రారంభించింది. డబ్బింగ్ స్టూడియోలో రజనీకాంత్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది రితికా. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ ముస్లిం పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.