calender_icon.png 7 February, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుపేర్లు డిపెండెంట్స్ పై కరుణించయ్య భద్రాద్రి బలరామయ్య

07-02-2025 07:34:51 PM

టీబీజీకేఎస్ నాయకులు..

భద్రాద్రి (విజయక్రాంతి): సింగరేణి సంస్థలో దాదాపు 3,000 మంది మారు పేర్లు సమస్యలతో ఉన్నవారిని, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతున్నారు. వీరి సమస్యను పరిష్కరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ డిమాండ్ చేసారు. గతంలో గుర్తింపు సంగంగా టీబీజీకేఎస్, జాతీయ సంఘాలు ఆర్ఎంసి దగ్గర మారుపేరుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అనంతరం ఎలక్షన్ రావడంతో ఆ సమస్యపై గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంలో, భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి  ప్రచారంలో పాల్గొని, మారుపేర్ల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కానీ 14 నెలలు గడుస్తున్న ఆ సమస్య సమస్యగానే మిగిలిపోయింది . ఈనెల రెండవ తారీకు నుండి  మారుపేరుల సమస్యతో ఇబ్బంది పడుతున్న డిపెండెంట్ పిల్లలు,బెల్లంపల్లి లోని గొల్లెటి నుండి కొత్తగూడెం లోని సింగరేణి హెడ్ ఆఫీస్ వరకు పాద యాత్ర చేస్తూ హెడ్ ఆఫీస్ కు చేరుకొని   ధర్నా నిర్వహించడం జరిగింది. వారికి టీబీజీకేఎస్ మద్దతు తెలిపింది. అనంతరం డీజీఎం పర్సనల్ వరప్రసాద్  కు డిపెండెంట్స్ మారు పేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని మెమోరండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిపెండెంట్స్ లతో పాటు టీబీజీకేఎస్, నాయకులు కాపు కృష్ణ, కూసాన వీరభద్రం, గడప రాజయ్య వసికర్ల కిరణ్, రాసూరు శంకర్, బూర్గుల రవికుమార్, అశోక్, వెంకటేశ్వర్లు, తొగర రాజశేఖర్, కాజా భక్ష, షమ్మీ, రవి, శ్రీను, సిఐటియూ, ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.