24-02-2025 12:00:00 AM
కష్టంలో ఉన్న మహిళా
కుటుంబానికి చేయూత
అభాగ్యురాలికి అండగా నిలిచిన
కూసుమంచి యువత
కూసుమంచి, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): ఆ మహిళ పనికి వెళ్తేనే ఇంట్లో పూట గడుస్తుంది. మండల కేంద్రంలో ఓ దుకాణంలో కార్మికురాలిగా పని చేసు కుంటూ కుటుంబాన్ని వెళ్ళతీసేది. అనుకోకుండా ఆ మహిళ గుండె పెద్ద కష్టాన్నే తెచ్చింది. దీంతో సహాయం అందించే చేతుల కోసం ఎదురు చేస్తుంది.. కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన తాటికొండ రేణుకా ఓ దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది..
ఉన్న ట్టుండి అనారోగ్యం పాలవడంతో వైద్య పరీ క్షలు చేయగా గుండె ఉండాల్సిన పరిమాణం కన్న ఎక్కువ ఉండడం, గుండెలోని ఒక రంధ్రం నుండి రక్తం బయటకు వస్తుండ డంతో పెద్ద అనారోగ్య సమస్యతో బాధప డింది.. ఆమెకు వెంటనే గుండె సర్జరీ చేయా లని వైద్యులు చెప్పడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని స్థానిక నాయకుల ద్వారా మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి సర్జరీకి అవ సరమైన ఖర్చుల కోసం ప్రభుత్వం నుండి 2.5 లక్షలు మంజూరు చేశారు..
హైద్రాబాద్ లో నిమ్స్ లో శస్త్ర చికిత్స జరిగింది. శస్త్ర చికిత్స అనంతరం రేణుకా ఇంట్లోనే ఉండాలని వైద్యులు చూచించడంతో పనికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అసలుకే ఒంటరి మహిళ ఇద్దరు పిల్లలు రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబ అత్యంత దయనీయమైన స్థితిని తెలుసుకున్న కూసుమంచి మండల యువత ఆ కుటుం బానికి అండగా నిలిచేందుకు నడుం కట్టా రు..
అనుకున్నదే తడవుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ఆమె పరిస్థితిని తెలియజేసి ఆర్థిక సాయం అందించేలా చేశారు.. దాతలు కూడా ఆమె దిన పరిస్థి తులకు అండగా నిలిచారు. తమకు తోచిన సహాయం చేస్తూ మానవత్వం చాటుకుంటు న్నారు.. రేణుకా కుటుంబానికి అండగా నిలిచేందుకు ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్ 6300909896 కు సహాయంగా డబ్బులు అందించవచ్చు అని తెలిపారు.