వర్షాల కారణంగా వాతావరణం చల్లగా, తేమగా మారి మరీ అనారోగ్యాలు, అంటు వ్యాధులు పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం వ్యాధుల బారిన పడేది పిల్లలు, వారికి ఈ సమయం కాస్త గడ్డుకాలమే. తేమ కారణంగా జలుబు, దగ్గు, జ్వరాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలా చాలా రకాలుగా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్షం కారణంగా తేమ, బ్యాక్టీరియా, వైరస్ వల్ల పిల్లలు ముఖ్యంగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ఈ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచడానికి ప్రముఖ డాక్టర్ విష్ణువ్ రావు వీరపనేని అలర్జీ, ఆస్తమా వైద్య నిపుణులు చెప్తున్న సూచనలు ఏంటో తెలుసుకుందాం..
విటమిన్లు, ఖనిజాలతో నిండిన సమతుల్య ఆహారం పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. భోజనంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలను ఇవ్వాలి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. నారింజ, స్టాబెర్రీ, బెల్ పెప్పర్స్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు ముఖ్యంగా చిన్నారులకు ఇస్తూ ఉండాలి.
పరిశుభ్రంగా..
అంటువ్యాధులను నివారించడానికి పరిశుభ్రత పాటించడం కీలకం. ముఖ్యంగా భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలి. గోళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు కూడా తగ్గుతాయి.
నీటి కారణంగా..
నిలిచిపోయిన నీరు కారణంగా దోమల ఉత్పత్తి కేంద్రంగా మారి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఇంటికి సమీపంలో కంటైనర్లు, నిలువ ఉన్న నీరు ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయంలో దోమలు ఎక్కువగా చురుకుగా ఉన్నప్పుడు దోమతెరలు ఉపయోగించాలి.
తగిన దుస్తులు..
వర్షకాలంలో తేలికైన ఆరిపోయే దుస్తులు ధరించడం చాలా ముఖ్యం. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను పెంచేది ఎక్కువ సమయం తడి దుస్తుల్లో ఉండటం కూడా ఒక కారణం. జల్లులకు తడిసిపోకుండా ఉండేలా గొడుగు, రెయిన్ కోట్ ఉపయోగిస్తూ ఉండాలి.
పరిసరాల శుభ్రత..
నివాస స్థలాలను శుభ్రంగా, పొడిగా ఉంచాలి. అలా లేని పక్షంలో శ్వాసకోశ సమస్యలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా బాత్‌రూమ్స్, కిచెన్ వంటి వల్ల తేమ పెరిగే అవకాశం ఉన్న ప్రదేశాలలో క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ ఉండాలి. గాలి ప్రసరణకు వీలుగా తేమ స్థాయిలను తగ్గించడానికి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
డాక్టర్ విష్ణువు రావు వీరపనేని
అలర్జీ, ఆస్తమా వైద్య నిపుణులు,
శ్వాస హాస్పిటల్, నారాయణగూడ