17-12-2024 12:05:05 AM
జిన్నారం గురుకుల విద్యార్థుల ఎంపిక
పటాన్‌చెరు, డిసెంబర్ 16: ఈనెల 17 నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీయే) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ టోర్నమెంట్‌కు జిన్నారం గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, క్రికెట్ కోచ్ మహేశ్ సోమవారం తెలిపారు. 8వ తరగతి చదువు తున్న రాథోడ్ ధనుష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, డీ కార్తీక్ ఉమ్మడి మెదక్ జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. టోర్నమెంట్‌కు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.