calender_icon.png 22 October, 2024 | 5:02 AM

భారత్ వేదికగా తొలిసారి

20-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ 20వ ఎడిషన్‌కు భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. డిసెంబర్ 1 నుంచి 10 వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. తొలుత టోర్నీ కజకిస్థాన్‌లో జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల రిత్యా వేదికను భారత్‌కు మార్చారు. ఇప్పటివరకు టోర్నీలో భారత జట్టు ఎనిమిదిసార్లు పాల్గొనగా రెండుసార్లు (2000, 2022లో) ఆరో స్థానంలో నిలిచింది. భారత్‌తో పాటు ఇరాన్, సౌత్ కొరియా, చైనా, జపాన్, కజకిస్థాన్, హాంగ్ కాంగ్, సింగపూర్ పాల్గొననున్నాయి.