02-04-2025 12:57:42 AM
అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి విరాళం
కరీంనగర్, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): లక్ష్మీపూర్ లో శ్రీ లక్ష్మీ దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి విఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి 1,1,116 రూపాయల విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డిని కమిటీ సభ్యులు సత్కరించారు. సకాలంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నరేందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బుర్ర శరత్ బాబు, కోశాధికారి సిహెచ్. జితేందర్రావు, ప్రసాద్, కిరణ్ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.