calender_icon.png 22 February, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే..

16-02-2025 12:00:00 AM

గర్భ సమయంలో కొద్దిపాటి భోజనంతోనే పొట్ట నిండిపోతూ ఉంటుంది. కాబట్టి తీసుకునే కొద్దిపాటి ఆహారం పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అందుకోసం నియమాలు పాటించాలి. 

గర్భిణి సాధారణం కంటే 300 క్యాలరీలు అధికంగా తీసుకోవాలి. ఇందుకోసం తక్కువ ఆహారంలో ఎక్కువ క్యాలరీలు ఉండేలా, పోషక పదార్థాలనే ఎంచుకోవాలి. గర్భిణి తీసుకునే క్యాల్షియం మీదే కడుపులో పెరిగే బిడ్డ ఎముకల దృఢత్వం ఆధారపడి ఉంటుంది. కాబట్టి గర్భిణులు తప్పనిసరిగా పాలు, పెరుగు, జున్ను లాంటివి తీసుకుంటూ ఉండాలి. ఐరన్ సమృద్ధిగా శరీరానికి అందడం కోసం ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నట్స్, డ్రై ఫ్రూట్స్, పండ్ల రసాలు తీసుకోవాలి.

వాంతుల సమస్య వేధిస్తున్నా, కడుపు నిండిన భావనతో ఆకలి మందగిస్తున్నా ఆశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవాలి. ఒకే సారి ఎక్కువగా భోజనం చేయకుండా, తక్కువ పరిమాణాల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. చిగుళ్ల వాపు, దంత సమస్యలు లాంటి చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు గర్భిణుల్లో సహాజం. అయితే వాటికి చిట్కాలు పా టించడం మాని, వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. అలాగే స్వీయ చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్ మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.