calender_icon.png 30 October, 2024 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు చదువు, క్రీడలు రెండు కళ్ళ లాంటివి

30-10-2024 01:29:29 PM

క్రీడాకారులను అభినందించిన ప్రిన్సిపల్.. 

సిద్దిపేట (విజయక్రాంతి): విద్యార్థులకు చదువు, క్రీడలు రెండు కళ్ళ లాంటివని చదువులో రాణిస్తూనే విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సిద్ధిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్) 68వ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న కళాశాల విద్యార్థులు అశోక్, గణేష్, సిద్రాఫాతిమా లను బుధవారం అభినందించి సర్టిఫికెట్లను అందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందుతుందని చెప్పారు. క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జ్ అశోక్, స్టూడెంట్స్ కౌన్సిలర్ కనకచంద్రం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దరిపల్లి నగేష్, కోచ్ వెంకటేష్, సీనియర్ అద్యాపకులు నంట శ్రీనివాస్ రెడ్డి, వెంకటరమణ, రఘురాజ్, కౌసర్ విజయభాస్కర్, విఠల్, నవనీత, కొమురయ్య, దాసు, ఖుర్షిదా తదితరులు పాల్గొన్నారు.