calender_icon.png 15 January, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్మ సౌందర్యం కోసం..

25-10-2024 12:00:00 AM

ప్రస్తుతం చాలామంది శాకాహారం ఎక్కువగా తీసుకుంటు న్నారు. ఇది ఆరోగ్యవంతమైన జీవనానికి దోహదపడుతుంది. జంతు ప్రేమికులు నుంచి వచ్చిన వెగన్ అనే ఆలోచన ఆరోగ్యంగానే కాకుండా అందం కూడా పెంచేలా చేస్తోంది. సౌందర్యంపై ఆసక్తి పెరుగుతుండటంతో వెగన్ స్కిన్ కేర్ ప్రాచుర్యంలోకి వచ్చింది. సేంద్రీ య చర్మ సంరక్షణతో కెలాంటి కెమికల్స్ లేకుండా నేచురల్‌గా ఉండటమే అందుకు కారణం.

అందుకే చాలామంది వెగన్ స్కిన్ కేర్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. అశ్వగంధం, ఆయుర్వేద పదార్ధాలు లాంటివన్నీ వెగన్ స్కిన్కే ర్ కిందకు వస్తాయి. కలబంద, గ్రీన్ టీ, కొబ్బరినూనె లాంటివి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. ఈ ఉత్పత్తుల్లో తరచుగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మానికి సహజ పరిష్కారాన్ని అందిస్తాయి. అందుకే వెగన్ స్కిన్ కేర్ సో బెటర్ అని అంటున్నారు బ్యూటీషియన్లు.