18-03-2025 12:36:56 AM
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17(విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకా రవేతనాలు అందించేలా యూజీసీ, ఇతర ఏజన్సీలతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఓయూ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబా బు నాయక్, కొనకంటి లక్ష్మీనారాయణ, రేణికుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్ సహా డిప్యూటీ డైరెక్టర్ చరణ్‌దాస్‌తో కలిసి ఆయన ఓయూ ను సందర్శించారు.
ఎస్సీ, ఎస్టీ అధ్యాపకు లు, ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొం టు న్న సమస్యలు, పరిష్కార మార్గాలపై ఇంజినీరింగ్ కళాశాలలోని ఈ క్లాస్ రూంలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం తీసు కుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్‌కు వివరించారు. ఓయూలో అమలు చేస్తున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, వివిధ రంగాల్లో ఓయూ పురోగతిని తెలియజేశారు. కార్యక్రమంలో ఓయూలోని వివిధ కళాశాలలు, విభాగాల ప్రిన్సిపాళ్లు, డీన్లు, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.