calender_icon.png 14 January, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థులకు

27-12-2024 01:22:42 AM

బంజారా ఎంప్లా యీస్ మద్దతు

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో పోటీచేస్తున్న పీఆర్టీయూటీఎస్ అధికార అభ్యర్థులకు తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘ్ తమ పూర్తి మద్దతిస్తున్నట్టు ప్రకటించింది. ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీపీ రాథోడ్, తులసిరాం రాథోడ్ ఈ మేరకు పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పుల్గం దామోదర్‌రెడ్డికి మద్దతు లేఖను అందజేశారు.

వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి శ్రీపాల్‌రెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోగజకవర్గంలో వంగ మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సంఘం మద్దతిస్తున్నట్టు గురువారం పీఆర్టీయూ టీఎస్ ఒక ప్రకటనను విడుదల చేసింది.