calender_icon.png 20 March, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవింగ్‌లో సిగరెట్ తాగద్దన్నందుకు..

19-03-2025 11:45:49 PM

సివిల్‌ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీకి చేదు అనుభవం

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): డ్రైవింగ్‌లో ఉన్నపుడు సిగరెట్ తాగద్దని ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు సూచించినందుకు సివిల్‌సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్ధార్, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్‌కు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. ఇబ్రహీంపట్నంలో హైదరాబాద్ డిపో 1కు చెందిన బస్సు ఎక్కిన ఆయన డ్రైవర్ సిగరెట్ తాగుతున్నట్లు గమనించి అది సరికాదన్నందుకు ఆయన పట్ల డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఫొటోలు తీసి ఎక్స్ వేదికగా ఆయన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్టీసీ అధికారులు సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని రిప్లై ఇచ్చారు.