calender_icon.png 21 December, 2024 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నచిన్న గాయాలకు..

15-10-2024 12:00:00 AM

వంట చేసేటప్పుడు అనుకోకుండా చేతులు కాలడం, కూరగాయలు కట్ చేసేటప్పుడు గాయాలు కావడం సహజం. కొన్నిసార్లు చిన్నగాయం కూడా పెద్దగా ఇబ్బందిని కలిగిస్తుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన రెమెడీస్‌ను వాడితే మంచి ఫలితం ఉంటుంది. తక్షణ ఉపశమనం కూడా కలుగుతుంది. 

ఐస్ ముక్కలు..

వంటచేసేటప్పుడు చర్మం కాలితే.. ఆ ప్రాంతంలో చల్లటి నీటితో కడగాలి. లేదంటే చల్లటి నీటిలో ఓ పది నిమిషాలు ఉంచాలి. ఇలా చేస్తే కాలిన ప్రాంతంలో మంట తగ్గుతుం ది. ఒకవేళ చల్లటి నీరు అందుబాటులో లేకుం టే ఫ్రిజ్‌లోని ఐస్ ముక్కలను కాలిన గాయంపై నేరుగా పెట్టకుండా.. ఒక కాటన్ గుడ్డలో పెట్టి గాయంపై రుద్దితే చికాకు, మంట తగ్గుతుంది.

కలబంద..

కాలిన ప్రదేశంలో కలబంద జెల్‌ను రాయడం వల్ల చికాకు తగ్గి.. గాయం త్వరగా మానటానికి ఉపయోగపడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే చర్మంపై ఉండే కాలిన గుర్తులు కూడా మయం అవుతాయి. 

పాలు, పెరుగు..

పాలు, పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్, ప్రొటీన్లు చర్మపు చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. చేతులు కాలినప్పుడల్లా, వాటిని చల్లని పాలు లేదా పెరుగులో ముంచాలి. ఇది చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. అంతే కాకుండా గాయం తాలుకు తీవ్రతను కూడా తగ్గిస్తుంది. 

టీ బ్యాగ్..

టీలో ఉండే టానిన్లు చర్మంపై మంట, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. కాలిన ప్రదేశంలో చల్లటి టీ బ్యాగ్‌ను ఉంచాలి. ఇది చర్మంపు చికాకును తగ్గిస్తుంది. అంతే కాకుండా గాయం నొప్పిని తగ్గిస్తుంది.

దోసకాయ రసం..

దోసకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. తాజా దోసకాయ తురుము, దాని రసం తీసి కాలిన ప్రదేశంలో రాస్తే.. గాయం మంట తగ్గి చల్లదనాన్ని అందిస్తుంది.