calender_icon.png 23 October, 2024 | 3:18 AM

మానసిక ప్రశాంతతకు..

18-06-2024 12:05:00 AM

కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం, అందమైన ప్రపంచాన్ని అన్వేషించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయాణాలకు దూరంగా ఉండేవారు, ప్రయాణం వల్ల కలిగే ప్రయోజనాలను తప్పక తెలుసుకోవాలి. ప్రయాణం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన గొప్ప అనుభవం. ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రజలు తమ సెలవు దినాలను కొత్త ప్రదేశాలను సందర్శించడానికి ఉపయోగిస్తున్నారు. ఇది చిన్న ప్రయాణమే అయినా.. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మిమ్మల్ని రిలాక్స్‌గా చేస్తుంది. ట్రావెలింగ్ మీ మానసిక ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కొత్త వ్యక్తులు, కొత్త ప్రదేశాలు, కొత్త ఆహార వంటకాలు కూడా కొత్తదనాన్ని కలిగిస్తాయి. 

డిప్రెషన్ లేదా ఆందోళనతో బాధపడుతుంటే.. సోలో జర్నీ చేయడం ఇంకా మంచిదని మానసిక నిపుణులు చెబుతున్నారు. మీకిష్టమైన ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకుని.. కొద్దిరోజులు అక్కడే గడపండి.. అది ఒక మంచి మెడిసిన్‌లా పని చేస్తుంది. డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది. ట్రావెలింగ్ అంటే కొత్త ప్రదేశానికి వెళ్ళడం కాదు భిన్న సంస్కృతులను, చరిత్రను, జీవన విధానాన్ని తెలుసుకోవడం.  

ట్రావెలింగ్ సృజనాత్మకతను పెంచుతుంది. ప్రతి పరిస్థితిలో జీవించడానికి ప్రయాణం సహాయపడుతుంది. పరిస్థితులను ఎలా ఎదుర్కో వాలి, తెలియని నమ్మకాలు, సంప్రదాయాలు ఉన్న వ్యక్తులతో ఎలా మాట్లాడాలి ఇలా అనేక విషయాలను నేర్పుతుంది. సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ప్రయాణించేటప్పుడు అపరి చితులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటారు. ముఖ్యంగా సోలో జర్నీ ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ప్రశాంతతను పెంచుతుంది.