23-02-2025 12:10:30 AM
జీవితంలో సమస్యలు చాలా కామన్. చుట్టూ ఉన్న వాతావరణం మంచిది కానప్పుడు అవి మరింత పెద్దవిగా కనిపిస్తాయి. అటువంటి సమయంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ఉన్న ప్రదేశంలో సంతోషంగా లేరని భావిస్తే మాత్రం వీలైనంత త్వరగా అక్కడ నుంచి దూరంగా వెళ్లడం మంచిది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కూడా మానసిక ప్రశాంతతను పొందుతారు.
నిరాశకు గురవుతున్నట్లు అనిపిస్తే.. మాత్రం ప్రతిరోజూ ప్రేరణనిచ్చే మంచి పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి.
తగినంత నిద్ర లేకుంటే శారీరకంగా, మానసికంగా కుంగిపోతారు. అంతే కాకుండా అనారోగ్యం బారిన పడి ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. కాబట్టి ప్రశాంతంగా నిద్ర పోవడం చాలా ముఖ్యం.
మానసిక ప్రశాంతత కోసం ముఖ్యంగా మీ కోసం మీరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవడం చాలా అవసరం. మీకు నచ్చిన సంగీతాన్ని వినడం, నచ్చిన పని చేయడం వంటివి చాలా ముఖ్యం.
అలాగే వ్యాయామం, యోగా ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. యోగా వల్ల మన మనస్సు సానుకూల ఆలోచనలతో నిండిపోతుంది.