calender_icon.png 17 October, 2024 | 12:17 AM

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం

29-09-2024 12:00:00 AM

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్

క్రమం తప్పకుండా మదుపుచేయడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల్ని సాధించ డానికి సిస్టామ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్‌లు) తప్ప మరో పెట్టుబడి సాధనం లేదని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు చెపు తుంటారు. పలు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ల్లో ఈ ప్లాన్స్ ద్వారా మదుపు చేయ వచ్చు.

ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని పొదుపు చేయ డం ద్వారా రిటైర్‌మెంట్ ఫండ్, కొత్త గృహం కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి  అనువైనవి. మీరు చేసే మదుపును మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్, బాండ్లు తది తరాల్లో పెట్టుబడి చేస్తాయి.

వాటితో వచ్చే లాభాలను తిరిగి పెట్టుబడి చేసి అదనపు రాబడుల్ని తీసుకురావడం ద్వారా మీ డబ్బు ను వృద్ధి చేస్తాయి. దీర్ఘకాలానికి వీటిలో పె ట్టుబడి చేస్తేనే ఈ ప్రయోజనం లభిస్తుంది. దీంతో పాటు  మ్యూచువల్ ఫండ్స్ నిర్వ హించే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్  క్రమశిక్షణతో పెట్టుబడి చేసే అలవాటును కూడా ఇన్వెస్టర్లకు అలవ రుస్తాయి.