01-04-2025 01:05:54 AM
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): స్థానిక సంస్థల బలోపేతానికి బీజేపీ విజయం ఎంతో అవసరమని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నినాదంతోనే ముందుకెళ్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామ పంచాయతీలకు కాంగ్రె స్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు చేసింది శూన్యమని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలను అమలుచేయలేక చేతులెత్తేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రెండు పార్టీల పని అయిపోయిందని ఎద్దేవా చేశారు.
అందుకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం గా ప్రచారం చేసినప్పటికీ, ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగా ణలో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ రాకుండా, కాంగ్రెస్‌కు మరో అవకాశం లేకుండా ఈ రెండు పార్టీలపై పోరాటం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీజేపీ బలపడాలని, రాష్ట్ర సమ స్యలపై పోరాడాలని, అధికారంలోకి రావాలని ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాల్లో వైఫల్యం చెందుతోందని.. ప్రజలు కూడా ఆ పార్టీ పట్ల తీవ్ర విముఖతతో ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి అత్యంత అనుకూలమైన ప రిస్థితులు ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మె జార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, పార్టీ తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ నేతలు బీబీపాటిల్, విజయరమణారావు, చింతల రాంచంద్రారెడ్డి, గుజ్జుల ప్రే మేందర్ రెడ్డి, పార్టీ వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనే తలు పాల్గొన్నారు.