calender_icon.png 23 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పరిశీలనకు.. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు

03-07-2024 12:48:03 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 2 (విజయక్రాంతి): రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనకు వెళ్లాయి. ఇటీవల స్టాంపులు, రిజిస్ట్రేష న్ శాఖ కమిషర్‌గా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి బుద్దప్రకాశ్ మండల, డివిజన్, జిల్లా స్థాయిలో వచ్చిన ప్రతిపాదనలపై అన్ని కమిటీల ఆమోదం తీసుకున్నారు. అనంతరం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ పరిశీలనకు పంపా రు. ఒకటిరెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలపై పునఃసమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 1 నాడే పెంచిన ప్రతిపాదనలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి 15వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనల్లో హెచ్చు తగ్గులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు సమచారం.