calender_icon.png 16 March, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరిసే చర్మానికి..

16-03-2025 12:54:04 AM

దానిమ్మ పండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ తొక్కతో తయారు చేసిన స్క్రబ్ వల్ల మచ్చలు తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది. దానిమ్మతో తయారుచేసిన సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. 

దానిమ్మ ఫేస్ ప్యాక్..

దానిమ్మ పండు తొక్కను సాయంత్రం ఎండలో బాగా ఆరబెట్టి, దాన్ని మెత్తగా పొడి చేయాలి. ఈ పొడి ముఖానికి మంచి ఫలితాలను అందిస్తుంది. దీన్ని నిల్వ చేసుకుని.. అవసరానికి తగ్గట్టు వాడుకోవచ్చు. దానిమ్మ పొడిలో ఒక చెంచా చక్కెర, ఒక చెంచా తేనె, ఒక చెంచా అవకాడో నూనె కలపాలి. ఇది మంచి స్క్రబ్‌లా తయారవుతుంది. ఈ పేస్ట్‌ను ముఖంపై రుద్దితే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ స్క్రబ్‌ను ముఖంపై 10 నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేసి.. తర్వాత చల్లటి నీటితో బాగా కడగాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.