అందమైన స్కిన్ టోన్ కోసం చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించదు. అయితే సాధారణంగా కాలుష్యం, ఒత్తిడి కారణంగా ముఖంపై గ్లో తగ్గుతుంది. ముఖం కాంతివంతంగా కనిపించాలంటే.. ఆహారంలో మార్పులు చేసుకోవాలని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఐదు పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.. అవేంటో చూద్దాం..
- స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ సి ముఖంపై వృద్ధాప్య చాయాలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు ఇది మొటిమలతో పోరాడటమే కాకుండా స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది.
- నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇంకా చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. నారింజలోని విటమిన్ సి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియలో ఉపయోగపడుతుంది. ఇది ప్రోటీన్లను కొల్లాజెన్‌గా మార్చడానికి పనిచేస్తుంది.
- చేపలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది ముఖంపై వాపు, ఎరుపును నివారిస్తుంది. అదనంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడతాయి.
- కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది నేరుగా చర్మంపై ప్రభావం చూపుతుంది.