ముఖానికి కాంతినిచ్చే సహజమైన ఉత్పుత్తుల్లో ముఖ్యంగా మన ఇంట్లో వాటినే ఎక్కువగా ముఖానికి వాడుతే మంచిది. పండ్లతో వేసే ప్యాక్స్ ముఖానికి అందాన్ని, సహజత్వాన్ని ఇస్తాయి. వీటిలో ముఖ్యంగా విటమిన్ సి, ఇ, కెతో పాటు అనేక పోషకాలుంటాయి. ఈ పండ్లలో కివి పండునే తీసుకుంటే ఈ అన్ని విటమిన్స్ తో పాటు మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని తేమగా, కాంతివంతంగా, ఎక్స్ ఫోలియేషన్ వరకు వివిధ చర్మ సమస్యలను నివారిస్తుంది. కివి, తేనె, పెరుగు, కివీ దోసకాయలతో చేసే ప్యాక్స్ చర్మానికి మంచి కాంతిని ఇస్తాయి.
కివి, తేనె ప్యాక్..
పండిన కివి పండును తీసుకోవాలి. ఒక చెంచా తేనె కలిపి ముఖానికి, మెడకు మాస్క్ లా వేసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచి శుభ్రం చేయాలి.
కివీ, పెరుగు ప్యాక్..
ఒక చెంచా పెరుగులో కివీ పండ్లను ఒక గిన్నెలో మెత్తగా చేయాలి. దీనిలో పెరుగు బాగా కలపాలి.ముఖం, మెడకు మాస్క్‌ను అప్లు చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ ప్యాక్‌ను గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
కివీ, దోసకాయ ప్యాక్..
పండిన కివీ పండు, దోసకాయ ముక్క కివీ పండును మెత్తగా చేయాలి. దోసకాయ తురుము మెత్తని కివీ పండు గుజ్జు 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి. చర్మం కాంతి వంతంగా మారేందుకు కొన్ని రకాల అలెర్జీల నుంచి తప్పించుకునేందుకు కివీ పండు చాలా బాగా సహకరిస్తుంది.