26-04-2025 12:00:00 AM
నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఇంటర్‌లో ఫెయిల్ అయినందుకు మనాస్థాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల హనుమాన్ వాడకు చెందిన జస్వంత్ (17) మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగూడ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్టియర్ ఫలితాల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు.
మనస్థాపం చెంది కళాశాలలోనే గురువారం పురుగుల మందు తాగాడు. కళాశాల సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు బం దోబస్తు ఏర్పాటు చేశారు.