calender_icon.png 22 January, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల శిక్షణ కొరకు రూ. 309 కోట్లు

24-07-2024 01:22:34 AM

సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ కోసం రూ. 86.13 కోట్లు

ఈ-గవర్నెన్స్ ప్రోత్సాహకానికి రూ. 80 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 23 : 2024 బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ కొరకు రూ. 309.74 కోట్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సిబ్బంది, ఫిర్యాదుల పరిష్కారం, పెన్షన్ల కోసం కేటాయించిన రూ. 2,328.56 కోట్ల నిధుల నుంచే వీటిని వినియోగించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఉద్యోగుల శిక్షణ కొరకు కేటాయించిన మొత్తం రూ. 309.74 కోట్లలో రూ.103.05 కోట్లను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (ఐఎస్‌టీఎమ్), లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రాల ఆధునీకరణ కొరకు వినియోగించనున్నట్లు తెలిపారు. మరోవైపు, ఉద్యోగుల శిక్షణ పథకాల అమలు కొరకు కేంద్రం రూ. 120.56 కోట్లు కేటాయించింది.

సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ లేదా మిషన్ కర్మయోగి పథకానికి రూ. 86.13 కోట్లను కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగులు మరింత సృజనాత్మకంగా పనిచేయాలనే లక్ష్యంతో మిషన్ కర్మయోగి పథకాన్ని మోదీ ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణ, ఈ ప్రోత్సహించేందుకు, పరిపాలనా సంస్కరణలను అమలు చేసేందుకు రూ. 80 కోట్లు కేటాయించింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ప్రచారం కోసం రూ. 2.6 కోట్ల నిధిని కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారానికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)కి రూ. 157.72, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ)కి రూ. 418.15 కోట్లు కేటాయించింది.