ప్రభుత్వ పథకాలు అందించేందుకే వార్డు సభలు మున్సిపల్ ఈఈ కిరణ్
సూర్యాపేట జనవరి 24 : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకే ప్రభుత్వం వార్డు సభలను ఏర్పాటు చేసిందని మున్సిపల్ ఈ ఈ కిరణ్ అన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో 45వ వార్డులో ఏర్పాటుచేసిన వార్డు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ భరోసా పథకాలను అమలు చేసేందుకే ఈ వార్డు సభలను నిర్వహిస్తుందని అన్నారు. ప్రస్తుతం అధికారులు గతంలో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను చదివి వినిపిస్తున్నారని అందులో పేర్లు రానివారు మరల పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకుంటే అధికారులు సర్వే నిర్వహించి నిష్పక్షపాతంగా అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి ఉపేంద్ర చారి, వార్డు నాయకులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.