ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఏటా నవంబర్ 14న నిర్వహించుకుంటాం. మధుమేహంపై ప్రజల్లో అవగాహన కల్పించ డమే ఈ దినోత్సవం నిర్వహించుకోవడం వెనుక ముఖ్యోద్దేశం. అయితే ప్రతి ఐదుగురిలో నలుగురు మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్యు లు చెబుతున్నారు. ప్రస్తుత జీవనశైలి, రోజంతా కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరం అనేక రోగాల బారిన పడుతోంది. భారతీయుల్లో 86 శాతం మంది మధుమేహం కారణంగా ఆందోళన, డిప్రెషన్, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) భారతదేశంతో సహా ఏడు దేశాల్లో జరిపిన సర్వే ఆధారంగా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతున్నట్లు తేలింది.
లక్షణాలు
* అలసట, నీరసం, తలతిరగడం
* మార్నింగ్ లేవగానే తీవ్రమైన తలనొప్పి, చెమటలు పట్టడం
* చర్మం పాలిపోవడం
* ఉదయం నిద్రలేచాక నోరు పొడిబారడం
* చూపు మసకబారడం
* నాడి వేగంగా కొట్టుకోవడం
* గాయాలు త్వరగా మానకపోవడం
* మార్నింగ్ లేదా రోజులో ఎప్పుడైనా దురదగా అనిపించడం
* తగినంత నిద్రపోయినా మార్నింగ్ అలసటగా అనిపించడం
* విపరీతమైన ఆకలి, దాహం, నైట్ టైమ్ కూడా ఇలా అనిపించవచ్చు జాగ్రత్తలు
తరచూ గ్లూకోజు మోతాదులను పరీక్షించుకోవాలి. ఒక మాదిరి హైపో లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా గ్లూకోజ్ లెవల్స్ పడిపోయినప్పుడు కొందరు స్పృహ తప్పి పడిపోతుంటారు. అప్పుడు స్పృహ తప్పినవారికి కొందరు నోరు తెరచి పంచదార పోయటం, చాక్లెట్ పెట్టటం, కూల్‌డ్రింకులు పోయటం వంటివి చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది ఒత్తిడిని తొలగిస్తుంది.
ఒత్తిడిని తొలగించడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయి. ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకో వడం వల్ల అది బీపీని పెంచుతుంది. బ్లడ్ ప్రెజర్ పెరిగితే షుగర్ లెవల్స్‌ను ప్రభావితం చేస్తుంది. ధూమపానం ఊపిరితిత్తులతో పాటు గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. డయాబెటిక్ లక్షణాలు ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
- డాక్టర్ ఆర్. వేణుగోపాల్, ఎంబీబీఎస్,
డీఏ (ఓఎస్‌ఎం) ఎఫ్‌సీజీపీ, ఎంహెఎస్‌సీ
డయాబెటాలజిస్ట్, శ్రీ వేంకటేశ్వర హాస్పిటల్
నాగార్జున సాగర్ రోడ్డు, హైదరాబాద్