02-03-2025 12:00:00 AM
పిల్లల మనసు ఎప్పుడైతే తాజాగా ఉంటుందో.. అప్పుడే ఏకాగ్రతగా పనిచేయగలుగుతారు. జ్ఞాపకశక్తి, సృజనాత్మకత మెరుగ్గా ఉంటాయి. గంటల తరబడి చదువుతూనే ఉండకుండా మధ్యలో విరామం తీసుకోవాలి. ఆ సమయంలో చిన్న పజిల్ తీసుకోవాలి. సరదాగా సుడోకు, క్రాస్‌వర్డ్స్ వంటివి పరిష్కరించేలా పిల్లలను ఉత్సాహపరచాలి. దీంతో పరిష్కార నైపుణ్యాలు పెరగడమే కాదు, ఏకాగ్రతనూ పెంచుతాయి. మెదడుకూ వ్యాయామంలా పనిచేస్తాయి.
కథలు: ఒక కాగితంపై పిల్లలకు నచ్చిన నాలుగైదు బొమ్మలు గీయమనాలి. వాటిని కలిపి చిన్న కథ చెప్పడానికి ప్రయత్నించమని ప్రోత్సహించాలి. పిల్లలకు ఇది సరదాగానూ ఉంటుంది. చదువు మధ్యలో విరామంలానూ పనిచేస్తుంది. ఈ గేమ్‌తో సృజనాత్మకత పెరుగుతుంది. దీంతోపాటు ఉదయం నిద్ర లేచిన వెంటనే పది నిమిషాలపాటు ధ్యానం చేయడం నేర్పించాలి. దీనివల్ల మానసికారోగ్యం మెరుగుపడి ఏకాగ్రత వస్తుంది.
రకరకాల ఆటలు: ప్రస్తుతం అనేక రకాల ఆటలున్నాయి. పిల్లల్లో క్రియేటివిటీని పెంచే ఆటలను పరిచయం చేసి ఆడేలా ప్రోత్సహించాలి. సృజనాత్మక ఆటల్లో గెలిచినవారికి బహుమతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.