23-02-2025 12:19:21 AM
జొన్న రొట్టెల నుంచి జొన్న బిర్యానీ వరకు ఈ జొన్నలతో రకరకాల వంటకాలు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. అయి తే ఈ జొన్నలతో చేసే గట్కా మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. దీన్ని కేవలం నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ఎండాకాలం చలువ కోసం.. బెస్ట్ రెసిపీ కూడా.. జొన్న గట్కాను ఎలా చేయాలో చూద్దాం..
తయారీ విధానం: ఈ జొన్న గట్కా తయారు చేసుకోవడానికి మనం ముందు జొన్న రవ్వను పిండి చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్‌లో ఒక కప్పు జొన్న, ఒక కప్పు రేషన్ బియ్యం వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని రవ్వ మాదిరిగా చేసుకోవాలి. జొన్న రవ్వగా మీడియం సైజ్‌లో ఉండే విధంగా చేసుకోవాలి.
ఆ తర్వాత ఆ రవ్వను ఒక పాత్రలో వేసుకుని, అందులో గట్కా ఉడికేందుకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత మీడియం మంట మీద ఆ గట్కాను ఉడికించుకోవాలి. నీరు మొత్తం గట్కాకు పట్టుకుని కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించుకుంటేనే జొన్న గట్కా సరిగ్గా ఉడుకుతుంది. గట్కా కొద్దిగా చల్లబడ్డాక అందులో ఒక కప్పు పెరుగు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. చివరగా రుచికి తగ్గట్టుగా నిమ్మరసం కలుసుకుంటే సరిపోతుంది. జొన్న గట్కా రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.