ఎముకల అరుగుదల మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 30 ఏళ్ల తర్వాత చాలామంది ఎముకల బలహీన సమస్యతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. పాతికేళ్ల వయసు తర్వాత ఎముకల బలపడటం ఆగిపోతుంది. ఎముకలు క్యాల్షియంతో తయారవుతాయి. ఆ క్యాల్షియం సాంద్రత ఎంత ఎక్కువ ఉంటే ఎముకలు అంత బలంగా ఉంటాయి. క్యాల్షియం సాంద్రత తగ్గుతూ ఉంటే ఎముకల్లో సూక్ష్మ రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఎముక స్పాంజ్లా మారిపోతుంది. దీనిని ఆస్టియోపోరోసిస్ అని వైద్యులు పిలుస్తున్నారు. బోలు వ్యాధి అని కూడా అంటారు. బోలు వ్యాధి వల్ల ఎముకలు పటుత్వం కోల్పోతాయి. అయితే ఈ సమస్యను నివారించాలంటే..
తృణధాన్యాలు తీసుకోవాలి
తగినంత కాల్షియం పొందడానికి బాదం, పాల ఉత్పత్తులు, కూరగాయలు, బలవర్థకమైన తృణధాన్యాలు తినాలి. అలాగే ఎముకలను బలోపేతం చేయడానికి విటమిన్‌డి అవసరం. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో సోయా పాలు, టోఫు, ఆకుకూరలు, చిక్కుళ్లు వంటి తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను చేర్చాలి.
సూర్యకాంతి నీడలో..
కనీసం పదిహేను నిమిషాలు వారానికి రెండు మూడు సార్లు ఉదయం సూర్యకాంతిలో కూర్చోండి. ఇది శరీరంలో విటమిన్‌డిని నింపుతుంది. అందువల్ల సూర్యుడికి దగ్గరగా ఉండాలి.
వ్యాయామం చేయండి
రోజూ 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చేయండి. దీంతో ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. దినచర్యలో యోగా, నడక, బాడీ మూమెంట్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, డ్యాన్స్, జాగింగ్ వంటి బరువు మోసే వ్యాయామాలను చేయండి.
ఆల్కహాల్, సిగరెట్లు తగ్గించండి
ధూమపానం, అతిగా మద్యపానం చేయడం వల్ల ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. దీని కారణంగా ఎముక సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. అందువల్ల వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి.