calender_icon.png 7 January, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలీ డబ్బులు అడిగినందుకు..

31-12-2024 02:20:06 AM

  • హెల్పర్‌ను మ్యాన్‌హోల్ మూతతో కొట్టిచంపిన తాపీమేస్త్రీ

పోలీసుల అదుపులో నిందితుడు

రాజేంద్రనగర్, డిసెంబర్ 30: చేసి  పనికి కూలీ డబ్బులు రూ.500 ఇవ్వాలని అడిగినందుకు ఓ కూలిని..తాపీమేస్త్రీ మ్యాన్‌హోల్ మూతతో దారుణంగా కొట్టి చంపిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాలు.. రాజేంద్రనగర్ బుద్వేల్‌కి చెందిన లాలుగాని సాయికుమార్(32) కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో సాయికుమార్ బుద్వేల్‌లోని చాకలి బస్తీకి చెందిన తాపీమేస్త్రీ బుల్లిశెట్టి శ్రీనివాస్ వద్దకు ఇటీవల కూలీపనికి వెళ్లాడు. దానికి సంబంధించి శ్రీనివాస్ రూ.500 సాయికు  ఇవ్వాల్సి ఉంది. ఆదివారం రాత్రి సాయికుమార్.. శ్రీనివా  బుద్వేల్‌లో కలిసి తనకు ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఇవ్వాలని అడిగాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ మ్యాన్‌హోల్ మూతతో సాయికుమార్‌పై తీవ్రంగాదాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలిం  అప్పటికే మృతిచెంది  వైద్యు  తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరచి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు.