calender_icon.png 3 March, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉజ్వల భవిష్యత్‌కు పట్టుదల, క్రమశిక్షణతో చదవాలి

22-01-2025 12:53:44 AM

ప్రముఖ రచయిత, గాయకుడు, అస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ 

ఘట్ కేసర్, జనవరి 21(విజయక్రాంతి): ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి విద్యార్థి పట్టుదల, క్రమ శిక్షణతో చదవాలని ప్రముఖ రచయిత, గాయకుడు, అస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ తెలిపారు. పోచారం మున్సిపాలిటీ విజయపురి కాలనీలోని విజయరత్న సీబీఎస్ పాఠశాల ఆవరణలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని సాధించే వరకు నిష్క్రమించకుండా కృషి చేసినప్పుడే అన్ని రంగాలలో రాణించి గుర్తింపు పొందుతారని చెప్పారు. ఈ సందర్భంగా వేధికపై విద్యార్థులు అద్భుతంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అబ్బురపరిచాయి.

పాఠశాలలోని ఆకాడమిక్ టాఫర్లను చంద్రబోస్ పతకాలతో  సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కే విజయసేనా రెడ్డి, ఎం నరెంద్రనాథ్, ఎం నర్సింహ్మరావు, కే శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.