calender_icon.png 1 April, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుట్‌వేర్ ట్రెండ్!

30-03-2025 12:00:00 AM

బ్యూటీ.. ఫ్యాషన్ అంటే దుస్తులు మాత్రమే అనుకునే రోజులు కావు ఇవి. తల నుంచి కాలి చెప్పుల వరకు అన్నింట్లోనూ కొత్తదనం కోరుకుంటోంది యువత. పైగా ఒకప్పటిలా ఇది అమ్మాయిల స్టుల్.. అది అబ్బాయిలది అంటూ వేర్వేరు లేవు అనేస్తున్నారు. వారి అభిప్రాయాలనికి తగ్గట్లే ఇప్పుడు ఓ వెస్ట్రన్ ఫుట్‌వేర్ ట్రెండ్ ఒకటి సందడి చేస్తున్నది. అదే బోట్‌మ్యాన్ షూస్ ఫ్యాషన్. వీటినే డెక్ షూస్, టాప్ సైడర్స్ అని కూడా అంటారు.

మెన్స్ ఫేవరిట్ అయిన వీటిని ఆడపిల్లలు తమ స్టుల్ స్టేట్‌మెంట్‌కి సింబల్‌గా భావించడం విశేషం. వీటిని సాధారణంగా కాన్వాస్, లెదర్, నాన్ మార్కింగ్ రబ్బర్‌తో తయారు చేస్తారు. బోట్‌లలో ప్రయాణించేవారు వీటిని ఎక్కువగా వేసుకుంటారు. అందుకే ఈ పేరొచ్చింది. ఫ్యాషన్ ప్రపంచంలో మగువమనసును దోచుకున్నాయి.