calender_icon.png 9 January, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి మడుల్లో కాలి బాటలు ఏర్పాటు చేసుకోవాలి

08-01-2025 08:08:49 PM

చెన్నూరు ఏడీఏ బానోత్ ప్రసాద్...

మందమర్రి (విజయక్రాంతి): రైతులు తమ వరి పంట పొలాల్లో పంటకు గాలి వెలుతురు తగిలే విధంగా కాళి బాటలు ఏర్పాటు చేసుకోవాలని చెన్నూర్ వ్యవసాయ శాఖ ఏడిఏ బానోత్ ప్రసాద్ కోరారు. మండలంలోని పులిమడుగు గ్రామంలో బుదవారం పంట పొలాలను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రైతులు వరి పొలం మడుల్లో తూర్పు పడమరలుగా ప్రతి రెండు మీటర్లకు 20 సెంటి మీటర్ల ఎడంతో కాలి బాటలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా వరి పైరుకు గాలి వెలుతురు బాగా తగిలి ఏపుగా పెరుగుతుందని, చీడ పీడలు, ముఖ్యంగా దోమ  పోటు అదుపులో ఉంటుందని ఆన్నారు. అదే విధంగా పైరుకు ఎరువులు వేయడానికి పురుగు మందుల పిచికారీకి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు పైరును పరిశీలించడం తేలిక అవుతుతుందని ఆన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి జి.కిరణ్మయి, విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజు, మహిళా రైతులు ఉన్నారు.