తేజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం ‘డ్యూడ్’. ఫుట్‌బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ సినిమాను ఫుట్‌బాల్ ప్రేమికుడైన దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు అంకి తమిచ్చారు. రంగాయన రఘు ఫుట్‌బా ల్ కోచ్‌గా ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటిం గ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.
ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్థ గౌడ్, యశస్విని, మెర్సి, మోనిష వివిధ రంగాలకు చెంది, ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘జింకే మారి’ ఫేమ్ మహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా, ‘అలా మొదలైంది’ ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. ఈ సినిమాను 2025 జూన్‌లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.