calender_icon.png 19 November, 2024 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓడినందుకు ఫుట్‌బాల్

13-08-2024 12:16:13 AM

సేలం(తమిళనాడు), ఆగస్టు 12: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోయారనే కోపంతో విద్యార్థులను ఓ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) చితకబాదాడు. బూటుకాలితో తన్నుతూ.. చెంపలు వాయించాడు. తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు గ్రామంలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు.. స్థానికంగా నిర్వహించిన ఓ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొని ఓడిపోవడంతో ఆ స్కూల్ పీఈటీ అన్నామలై కోపంతో విద్యార్థులను చితకబాదాడు. కాలితో ఇష్టం వచ్చినట్లు తన్నాడు.

కొంతమంది విద్యార్థులనైతే జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఉన్నతాధికారులు సదరు పీఈటీని సస్పెండ్ చేశారు. అయితే విద్యార్థుల పట్ల అంత కఠినంగా వ్యవహరించిన పీఈటీ తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు మనిషివేనా.. వాళ్లని అంతలా ఎందుకు కొట్టావ్?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘అసలు విద్యార్థులను బూటుకాలుతో కొట్టే అధికారం ఆయనకు ఎవరిచ్చారు’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.