తిరుమల, నవంబర్ 27: శ్రీవారు కొలువై ఉన్న తిరుమలలో భారీ నాగుపాము కనిపించింది. స్థానిక రింగ్‌రోడ్డు సమీపంలోని బీ క్వార్టర్స్‌లోని 23వ గది వద్ద సంచరిస్తున్న నాగుపామును మంగళవారం స్థానికులు గుర్తించారు. ఈ నాగుపాము దాదాపు ఎనిమిది అడుగుల పొడవు ఉంది. టీటీడీ ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం అం దించారు. అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నారు. అనంతరం పామును అవ్వాచారి కోనలో వదిలిపెట్టారు. పాము ఎవరికీ హాని చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.