calender_icon.png 27 January, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపోలోలో ఫుట్, యాంకిల్ కేర్ ప్రారంభం

25-01-2025 12:16:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): వైద్య రంగంలో అత్యున్నత సేవలందిస్తున్న అపోలో ఆస్పత్రి మరో ముందడుగు వేసింది. నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఆధునిక వసతులతో కూడిన మల్టీడిసిప్లినరీ సెంటర్ ఫర్ ఫుట్, యాంకిల్ కేర్‌ను ప్రారంభించింది. ఫుట్, యాంకిల్ సమస్యలతో బాధపడుతున్న వారికోసం అత్యాధునిక చికిత్సలు, ప్రత్యేక వైద్య సేవలను అందించేందుకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా శుక్రవారం ప్రముఖ పోడియాట్రిక్ సర్జన్ డా.శ్రీనివాస్ శేషభట్టారు మాట్లాడుతూ.. తమ వద్దకు వచ్చే రోగులు చివరి నిమిషంలో వచ్చినప్పటికీ వారిని కాళ్ల సమస్యల నుంచి రక్షిస్తున్నామని తెలిపారు. డయాలసిస్ రోగుల జీవితాల్లో వారి కదలికలను కాపాడేందుకు కీలక చికిత్సలు చేస్తన్నట్లు తెలిపారు. అత్యంత ఆదునికి సాంకేతికతతో గల సేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.