calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలందరికీ ఆహార భద్రత

12-04-2025 01:18:50 AM

  1. సన్న బియ్యం సరఫరా దేశానికే ఆదర్శం 
  2. రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

మణుగూరు ఏప్రిల్ 11 (విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్తం పూర్తిస్థాయిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శుక్రవారం  మణుగూరు మండలంలోని బొజ్జవారి గుంపు కూనవరం రోడ్డులోని ఎస్ టి కోయ తెగకు చెందిన వంక శివలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి సన్న బియ్యంతో తయారుచేసిన వంటకాలను ఆయన చవి చూశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తన ఇంట్లో భోజనానికి రావడంతో ఆ కుటుంబానికి, ఆ గ్రామంలోని ప్రజల ఆనందానికి అవధులు లేవని, తమ గ్రామంలోని నిరుపేదలైన గిరిజన కుటుంబంలో భోజనం చేయడానికి వచ్చిన ఆయనకు సన్న బియ్యం తో పాటు పాయసం, పులిహోర, సేంద్రీయ ఎరువులతో పండించిన తోటకూర పప్పు, గోం గూర చట్నీ,ఇతర ఆహార పదార్థాలను వడ్డించారు.

మంత్రివర్యులు సంతోషంగా తనివి తీర భోజనము చేసిన తర్వాత కుటుంబ సభ్యులను అభినందించి ఆయన మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఆహార భద్రత కల్పించేలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉగాది పండుగ నుంచి ప్రారంభించా మని సన్న బియ్యం పంపిణీ వలన ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. చరిత్రరాత్మకమైన ఘట్టంలో ప్రజలను భాగస్వా ములను చేస్తున్నామని, 80 శాతానికి పైచిలుకు బడుగు బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు.

అనంతరం వంక శివలక్ష్మి తన భర్త చనిపోయాడని కుటుంబ పోషణకు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని మంత్రి దృష్టికి తీసుకురాగా వారి కుటుంబానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి రాహుల్  ఇతర శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

బూర్గంపాడు,ఏప్రిల్ 11(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల అమలు తోపాటు,గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం గౌతాపురం ఆర్ అండ్ బి నుండి సోంపల్లి జడ్పీ వరకు సుమారు 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తానని అన్నారు. ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. సదరు గుత్తేదారులు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని,నాణ్యతలో రా జీ పడే ప్రసక్తే లేదని అన్నారు.అనంతరం సా రపాక గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గుడి ప్రథమ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఐటీడీఏ పీవో రాహుల్,ఉమ్మడి ఖ మ్మం జిల్లా మాజీ  డీసీసీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి,మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,బట్టా విజయ్ గాంధీ, భజన సతీష్,ప్రసాద్ పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 11 (విజయక్రాంతి)రాష్ట్రంలో గత ప్రభుత్వం పది సంవ త్సరాలలో చేయని అభివృద్ధి తమ ప్రభు త్వం వచ్చిన తర్వాత 15 నెలల్లో, ఆర్థిక పరిస్థితి సహకరించక పోయిన అభివృద్ధి, సంక్షే మ  కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శుక్రవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజలకు ఇచ్చిన హామీలను సంక్షేమ కార్యక్రమా లను ప్రతి పేదవాడికి అందే విధంగా ఇస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో  ఇందిరమ్మ ప్రభుత్వం హయాంలో చే సి చూపెడుతున్నామన్నారు. 

ప్రతి పేదవానికి 

ఇందిరమ్మ ప్రభుత్వ సహాయం లో ఇచ్చి న హామీలకు అనుగుణంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అంది స్తున్నామని, పేదవాళ్లే కావచ్చు ధనికులు కావచ్చు పది లక్షల రూపాయల వరకు పేదవాడికి జబ్బు చేస్తే రాజీవ్ ఆరోగ్య శ్రీ ఆరోగ్య కార్డు ద్వారా ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తున్నామని,500 రూపాయలకే ఉచిత గ్యాస్ పథకం, వాటితోపాటు రాజీవ్ యువ వికాస కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నిరుద్యోగ యువకులకు 50 వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు అందించే కార్యక్రమాన్ని ఈనెల 14 తేదీ అంబేద్కర్ జయంతి రోజు  ప్రారంభించనున్నామన్నరు.

ప్రతి పేద కుటుంబాలు తృప్తి గా సన్న బియ్యం తోటే భోజనాలు చేయాలని ఉగాది పండుగ రోజున ఈ బహుత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని, కాంగ్రెస్ ప్రభుత్వము వస్తే రైతులను రాజుని చేస్తామని వాగ్దానం చేశామని, అన్నమాట ప్రకా రం 2 లక్షల రూపాయల వరకు రైతన్నలకు రుణమాఫీ చేశామని, రూ 25.65 కోట్లు రైతు రుణమాఫీ చేసి,సన్న వడ్లు పండించే రైతన్నలకు ఎకరానికి రూ 500  బోనస్ ఇచ్చిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వందే అన్నారు.

త్వరలో పినపాక నియోజకవర్గానికి 3500 ఇండ్లు అందించడానికి ప్రణా ళికలు రూపొందిస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఎప్పటి నుండో పరిష్కరించకుండా ఉన్న పులుసు బొంత ప్రాజెక్టును రాబోయే కొద్ది నెలల లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోబోతున్నామని మంత్రి తెలిపారు.

ఈనెల 14 నాడు అంబేద్కర్ జయంతి రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిల్పారామంలో సాయంత్రం ఐదు గంటలకి భూభారత చట్టాన్ని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏదైతే ఒక మైలురా యిగా పేదవాడికి కష్టంతో సంపాదించుకు న్న భూములను భద్రత కల్పించే ఒక అద్భుతమైన భూభారతి చట్టం 2025 ని అన్ని జిల్లా కలెక్టర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ఈ సభకి ఆహ్వానించి, రాష్ట్రంలోనీ మారుమూల ప్రాంతంలో ఉండే భూములను ఆసాములకు  ద్వారా మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా ము ఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రభుత్వంపై ఎంత మంది, ఎన్ని శక్తులు, కుట్రలు కుతంత్రాలు పన్నిన ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి చేయలేరని ఆయ న తెలిపారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్,పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

బీటీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన 

అశ్వాపురం, ఏప్రిల్ 11 (విజయ క్రాంతి): సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి  ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర  రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవా రం  అశ్వాపురం మండలం ఆర్ అండ్ బి రో డ్డు నుండి భీమునిగుండం కొత్తూరు గ్రా మం వరకు రూ.63 లక్షలతో,  కుర్సం వారి గూడెం గ్రామం  ఆర్ అండ్ బి రోడ్డు నుండి జగ్గారం గ్రామం వరకు రూ1 .92 కోట్ల తో బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశా రు.

ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు, డిసిసిబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, సి.పి.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి అయోధ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మరియు ఐటిడిఏ పిఓ రాహుల్  పాల్గొన్నారు.