calender_icon.png 21 October, 2024 | 8:48 PM

ఫుడ్ స్టాల్స్‌లో ఆహార భద్రత ఉల్లంఘనలు

21-10-2024 04:45:48 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని ఐదు షావర్మా వెండింగ్ యూనిట్లలో రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను బహుళంగా ఉల్లంఘించినట్లు అధికారులు వెల్లడించారు. ముజ్తబా గ్రిల్స్ (ఈస్ట్ మారేడ్‌పల్లి), షాషా షాందర్ షవర్మ అండ్ రోల్స్ ఆన్ వీల్స్ (ప్యారడైజ్ మెట్రో స్టేషన్), సింక్ షావర్మ (సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్), ఏషియన్ చౌ (సికింద్రాబాద్)లలో తనిఖీలు జరిగాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండానే షాషా షాందర్ షవర్మ పనిచేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. అదనంగా, ముజ్తబా గ్రిల్స్, రోల్స్ ఆన్ వీల్స్ తమ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను ప్రముఖంగా ప్రదర్శించడంలో విఫలమయ్యాయి. ఈ తనిఖీలో ఆహార నిర్వహణకు సంబంధించిన పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయి.సరైన లేబులింగ్, శాఖాహారం, మాంసాహార వస్తువుల మధ్య విభజన లేకపోవడం, నిల్వ చేసే పద్ధతులు, పనీర్, మాంసం వంటి పాడైపోయే వస్తువులను కూడా టాస్క్ ఫోర్స్ గుర్తించింది.