21-03-2025 02:50:21 PM
శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): తెలంగాణలో ప్రముఖ పేరుగాంచిన కాకినాడ సుబ్బయ్య గారి హోటల్(Kakinada Subbayya Gari Hotel) కొండాపూర్ లో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు(Food safety officials) తనిఖీలు నిర్వహించారు. పేరుకు పెద్ద హోటళ్ అయినా ఫుడ్ సేప్టీపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్ట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. పెద్ద హోటళ్లు అంటే క్వాలిటీ ఫుడ్ అందిస్తారని భ్రమలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులు భారీగా గుర్తించారు.
కాలం చెల్లిన పదార్థాలను నిల్వ ఉంచి వాటితో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. హోటళ్లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతోపాటు, ఎక్స్ ఫైరీ డేట్ అయిన పప్పు దినుసులు,పెరుగు,పాలును గుర్తించి, అక్కడికక్కడే వాటిని చెత్త డబ్బాల్లో వేయించారు. అపరిశుభ్రంగా వున్నా కిచెన్ తో పాటు కిచెన్ లో డ్రైనేజీ వాటర్ పొంగుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కనీసం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా డిస్ప్లే చేయణి సుబ్బయ్య హోటల్ యాజమాన్యం,హోటల్ లో పని చేస్తున్న స్టాఫ్ కూడా కనీసం హ్యాండ్ గ్లోవ్స్,హెడ్ కాప్స్ కూడా దరించలేదని హోటల్ యాజమాన్యంపై మండిపడ్డారు.