22-03-2025 08:11:51 PM
టీ స్టాల్ లో నాసరకమైన చాయ్ పత్తి వాడొద్దని హెచ్చరిక..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని సూపర్ మార్కెట్లలో నాసిరకమైన వస్తువులతో పాటు కాలం చెల్లిన వస్తువులను అమ్మకాలు జరుపుతున్నారని ఫిర్యాదులు అందడంతో శనివారం నాగర్ కర్నూల్ ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి మనోజ్ జిల్లా కేంద్రంలోని మోర్ సూపర్ మార్కెట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులోని వస్తువులను నాణ్యత ప్రమాణాలు కాలం చెల్లిన బార్కోడ్ వంటి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మోర్ సూపర్ మార్కెట్ పై కేసు నమోదు చేయడంతో పాటు మరికొన్ని పదార్థాలను టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పరిసరాల్లో ఉన్న ఆన్ ఆంటీ టీ స్టాల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజారోగ్యంపై ప్రభావం చూపే నాసిరకమైన టీ పొడి వాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీ గ్లాసులు వాటర్ జగ్గు ఇతర పరిసరాలు సూచి శుభ్రత పాటించాలన్నారు.