calender_icon.png 7 November, 2024 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు

07-11-2024 12:58:48 PM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటల్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహిస్తున్నారు. మూసాపేట కృతుంగ రెస్టారెంట్ లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రెస్టారెంట్ కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. కిచెన్ లో కుళ్లిన చికెన్ ను అధికారులు గుర్తించినట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో ఆహార భద్రత అధికారులు హోటళ్లు, రెస్టారెంట్స్ పై వరసగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. 

నేటి యాంత్రిక యుగంలో జీవితం ఊరుకులు పరుగులకే సరిపోతుంది. ఇంట్లో భోజనం వండే టైమ్ లేకా కొందరూ.. వండిన భోజనం నచ్చక కొందరూ బయట హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్స్ తిని బ్రతికేస్తున్నారు. అలాంటి భోజన ప్రియులు ఇప్పుడు బయట భోజనం చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆహారం పైకి చూడడానికి కలర్ ఫుల్ గా కనిపించిన అపరిశుభ్రమైన భోజనం అందిస్తున్నారని తిండి ప్రియులు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బయట ఫుడ్ తిని పలువురు అస్వస్థకు గురవుతుంటే పలువురు చనిపోతున్నారు. ఇందుకు ఇటీవల నగరంలోని బంజారాహిల్స్ లో ఓ మహిళ మార్కెట్లో పెట్టిన మోమోస్ తిని మృతి చెందిన సంఘటనే నిదర్శనం.