హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(విజయక్రాంతి) : జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, కిచెన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కిష్కింద కిచెన్, పోష్నోష్‌లాంజ్ అండ్‌బార్‌లలో తనిఖీలు నిర్వహించగా.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ యాక్ట్ 2006 ప్రకారం వీరు పలు ఉల్లంఘనలకు పాల్పడ్డట్లు గుర్తించారు.
వంట గదుల్లో బొద్దింకలు, ఎలుకల మలం, కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించా రు. పోష్‌నోష్ అనే బార్‌లో తనిఖీలు చేసిన అధికారులు రిఫ్రిజిరేట్లు శుభ్రంగా లేనట్లు, వంటగదిలో వెజ్, నాన్‌వెజ్ ఆహారపదార్థాలను ఒకే చోట నిల్వ చేసినట్లు గుర్తించారు.