calender_icon.png 29 November, 2024 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలోని పలు హోటళ్లలో ఫుడ్‌సెఫ్టీ తనిఖీలు

29-11-2024 01:53:03 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): నగరంలోని పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మలక్‌పేట్‌లోని మలక్‌పేట్ ఫంక్షన్ హాల్, అజామ్‌పురాలోని హోటల్ ఢిల్లీ దస్తార్ ఖానా, ముసారాంబాగ్‌లోని ఓల్డ్ ముంబై ఐస్‌క్రీం, అల్ మటం అల్ బైట్ మండీ, ఛాదర్‌ఘాట్‌లోని హోటల్ నయగారా, షేక్‌పేట్‌లోని శ్రీలక్ష్మిఫుడ్స్, శ్రీజాస్ హోమ్ ఫుడ్స్, డీ అండ్ డీ ఫుఢీస్, కూల్ పాయింట్, టేస్టీ ప్యారడైజ్, నల్లకుంట స్కై షెడ్ రెస్టారెంట్, ఓయూ ఎన్‌సీసీ గేట్ రోడ్డులోని శివం మెస్, కాచీగూడ లోని రాఘవేంద్ర టిఫిన్స్, శ్రీబాలాజీ దర్శిని హోటల్, గాంధీనగర్‌లోని శ్రీ మోహన్స్ చాట్‌లో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయా హోటళ్లలో పరిసరాల పరిశు భ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హోటళ్లకు నోటీసులు అందజేసి, శాంపిళ్లను సేకరించారు. ఆహార కల్తీ నిర్ధారణ పరీక్షలో వచ్చే ఫలితాలు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.