calender_icon.png 15 January, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.!

08-08-2024 11:32:28 AM

25 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత           

అచ్చంపేటలో ఘటన      

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. విద్యార్థులు తిన్న బ్రేక్‌ఫాస్ట్‌ వికటించి 25 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం వద్ద ఉన్న ఆక్స్ఫర్డ్ ప్రవేటు పాఠశాల వసతి గృహంలో గురువారం చోటుచేసుకుంది. బెస్ట్ అవైలబుల్ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల్లో కొందరు అదే పాఠశాలలో వసతి పొందుతున్నారు. కాగా, గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో చపాతి, దోసకాయ పప్పు వడ్డించగా అది తిన్న విద్యార్థులకు గంట తర్వాత కళ్ళు తిరగడం కడుపులో మంట వాంతి విరేచనాలు కలిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీన్ని గుర్తించిన పాఠశాల ప్రిన్సిపల్ వెంటనే 25 మంది  విద్యార్థులను 108, 102 సాయంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.